కోర్టుకెల్తామని హెచ్చరిక
హైదరాబాద్ :
హైడ్రా కూల్చివేత లపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యపురి డివిజన్ లోని మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యటించి బాధితులను పరామర్శించిన ఈటల..రేవంత్ ప్రభుత్వంపై మండి పడ్డారు. హైడ్రా కూల్చివేతలపై కోర్టుకెళ్తామని, లక్ష మందితో ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెరువులు, కుంటల పరివాహన ప్రాంతాలోని భూమి ప్రభుత్వ భూమి కాదని, ప్రయివేటు వారిదన్నారు. జొన్నలబండ వద్ద గతంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఈటల… వాటిని కూల్చేందుకు ప్రస్తుత రేవంత్ సిద్దపడడం పట్ల మండిపడ్డారు. మూసీని సుందరీస్తే తమకు ఇబ్బంది లేదని, పేదలకు జీవితాలతో ఆడుకోవడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. హైడ్రా కూల్చివేతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకుండా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం..

- Advertisment -