సీఎం సోదరుడికి నోటీసులపై చర్చ
హైదరాబాద్ :
హైదరాబాద్‌లో హైడ్రా ఆపరేషన్‌కు పార్టీ నేతలు, వీఐపీలు అతీతులు కారనే సంకేతాలిస్తుంది ప్రభుత్వం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో సంచలనం రేపిన హైడ్రా.. హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసి కూల్చివేత లకు సిద్దమౌతోంది. ఇందులో భాగంగా దుర్గం చెరువుపై ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇందులో భాగంగా ఎఫ్‌టీఎల్ జోన్ పరిధిలో నిర్మాణాలున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు..చెరువు చుట్టూ ఉన్న ప్రముఖుల నివాసాల ఓనర్లకు నోటీసులు సర్వ్ చేశారు. 204 మందికి నోటీసులు జారీ చేశారు షేరిలింగంపల్లి తహసీల్దార్. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న నివాసం కూడ ఉంది. 30 రోజుల్లోగా ఆయా భవనాలను కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేశారు తహసీల్దారు. ఈ నేపథ్యంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్‌సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్లు తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు సీఎం సోదరుడు. ఈ నేపథ్యంలో నెక్లార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్ ప్రాంతాల్లోని భవనాలను అధికారులు తొలగించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. సీఎం సోదరుడు ఇచ్చిన స్టేట్ మెంట్‌తో స్పష్టత వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు ఉంటాయనేది స్ఫష్టమౌతుంది.
హైడ్రా కార్యచరణపై ఉన్నత స్థాయి సమావేశం
హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కూల్చివెతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. హైడ్రా, జీహెచ్‌ఏంసీ, హెచ్‌ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి.
రాజకీయాలకు అతీతంగా హైడ్రా చర్యలు
- Advertisment -