హుజురాబాద్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు లభించింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు గురువారం జిల్లా కలెక్టర్ పమేల సత్పతిని కలిశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హుజురాబాద్ ఆసుపత్రికి అవార్డు అందించిందని కలెక్టర్ తెలిపారు. 95% అచీవ్‌మెంట్ సాధించినందుకు ఈ హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక అయిందని..ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు కలెక్టర్. భారతదేశంలోనే టాప్ 3లో నిలవడం కరీంనగర్ కు గర్వకారణమని తెలిపారు.