(మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్):మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆయనను డబ్బు చప్పులతో డ్యాన్సులతో మహిళలు బతుకమ్మ బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఎన్నికల కోసం అన్ని అన్ని తిరుగుతున్నారని అలాంటి వారి మాటలు ఇప్పుడు నమ్మవద్దని నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు. బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటిని తప్పకుండా అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు .తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టి వెన్నుపోటు పొడిచే దొంగ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. మీ కష్టాలు కడదాకా తీరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార ర్యాలీలో ఆయనతో పాటుగా గడ్డం నాగరాజు జెడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ పాకాల మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా కచు రాజయ్య హనుమాండ్ల లక్ష్మారెడ్డి చింతలపల్లి సంజీవరెడ్డి బొయిని పల్లీ శ్రీనివాస్ రావు ఎలుక దేవయ్య అమిత్ రసమయి రామలింగారెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.