ఎంపీ బండి సంజయ్ సూటి ప్రశ్న
(మనకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని ఊరించారని అదికాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో విఫలం చెందారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు ఆయన మంగళవారం బెజ్జంకిలో మానకొండూరు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరెపల్లి మోహన్ తో కలిసి కార్నర్ మీటింగ్ కు హాజరై మాట్లాడారు యువత బతుకులు బతుకులు ఆగమయ్యయని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని బిజెపి నీ అధికారం తేవాలని అప్పుడే యువతకు న్యాయం జరుగుతుందన్నారు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళితుడు అయి కూడా దళితులకు చేసింది శూన్యమని ఆయన దెప్పి పొడిచారు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని మద్దతు ధర కూడా సరిగా కల్పించడంలో విఫలం చెందిందని ఆయన ఎద్దేవా చేశారు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్లకు ఇప్పుడున్న 2200 కాకుండా ₹3,100 చెల్లిస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని అది ఇస్తుంది కేంద్ర బిజెపి ప్రభుత్వం మోడీ దేనని ఫోటోలు మాత్రం రేషన్ షాపుల్లో కేసీఆర్ పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు ఇది ప్రజలు గమనించాలని ఆయన కోరారు మానకొండూరు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ పక్కా లోకల్ అని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ధనార్జన కొరకే ఇక్కడికి వస్తున్నారని వారు నాన్ లోకల్ అని ఆయన దెప్పి పొడిచారు ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బూర నర్సయ్య కరివేద మహిపాల్ రెడ్డి సొల్లు అజయ్ వర్మ కొలిపాక రాజు రంగు భాస్కరాచారి వెంకటరెడ్డి ముత్యాల జగన్ రెడ్డి సంగ రవి దొమ్మాటి రాముల తదితరులు పాల్గొన్నారు