Wednesday, September 18, 2024

హైందవ సంస్కృతిలో … ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినం వినాయకచవితి

– స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ స్పూర్తిని నింపిన పండుగ
– మట్టి గణపతిని పూజిద్దాం..పర్యవారణాన్ని కాపాడుకుందాం
–  మట్టి గణపతుల ప్రతిష్టాపనలను   ప్రోత్సహించడం మా లక్ష్యం
‌‌‌‌– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు
– ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ
–  కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన!
కరీంనగర్​,జనతా న్యూస్​:
 మన దేశ సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్​శంగానిలుస్తున్నాయని,విశ్వానికి వేద విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమని ఉమా పుత్ర ఉత్సవ కమిటీ చైర్మన్ కోట సతీష్ కుమార్ అన్నారు.మంగళవారం నగరంలోని విద్యానగర్, ప్యారిస్ లేన్ లో ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాభారతం ద్వారా సామాజిక విలువల్ని ప్రపంచానికి అందించిన మహత్తరమైన దేశం మన భారతదేశం. తరతరాలుగా  ఘనమైన వారసత్వంతో ముందుకు సాగుతున్న భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు, పవిత్రమైన పండుగలు ఆచారాలకు నెలవని కోట సతీష్ పేర్కొన్నారు.తమ తమ ఇళ్లలో అత్యంత భక్తి, ప్రపత్తులతో, నిష్టతో జరుపుకునే వినాయక చవితి పండుగ జాతీయోద్యమ సమయంలో సామాజిక పండుగగా రూపాంతరం చెందింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారతీయులందరిని ఏకతాటిపై ఉంచడానికి, భారత జాతిని సమైక్యంగా ఉంచడానికి లోకమాన్య బాలగంగాధర తిలక్  గణేశ్ నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారన్నారు.హైందవ సంస్కృతిలో వినాయకచవితి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే పర్వదినమని వినాయకుని ఆశీస్సులతో, ఈ పండుగను సకల సమృద్ధి, ఆనందం, శాంతితో జరుపుకోవాలని ఉమాపుత్ర ఉత్సవ కమిటీ తరపున మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
*మట్టి గణపతి ప్రతిష్టాపన:*
మట్టి గణపతుల వినియోగం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో సహాయపడుతుందని. పీవోపీ విగ్రహాలతో పోలిస్తే, మట్టి గణపతులు చాలా సహజమైనవి, ఎలాంటి రసాయనాలు లేకుండా, పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉంటాయని,గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత మట్టితో మళ్ళీ సృష్టి అవుతుంది, ప్రకృతికి ఎలాంటి హాని కలిగించదు. ఈ నేపథ్యంలో, మట్టి గణపతుల వినియోగం మరింత విస్తృతం కావాలని కోరుకుంటున్నామని కోట సతీష్ అన్నారు.
 ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగో ఆవిష్కరణ:
మా ప్యారిస్ లేన్ విద్యానగర్  గత సంవ్సరంలో వినాయక చవితి కార్యక్రమాలు ఎంతో  వినూత్నంగా  చేసాము,ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఉమాపుత్ర ఉత్సవ కమిటీ పలు వినూత్న కార్యక్రమాలను రూపొందించమని కమిటీ నిర్వాహకులు పేర్కోన్నారు.ఈ సందర్బంగా  కమిటీ యొక్క లోగోను ఆవిష్కరించడం జరిగింది.ఈ లోగోకు ప్రత్యేకమైన భావన, కమిటీ యొక్క ఆదర్శాలు, లక్ష్యాలు ప్రతిఫలించేలా రూపకల్పన చేయబడింది.ఇది మా సంఘం ఎలా పనిచేస్తుందో, సమాజంలో ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టంగా తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సంధర్బంగా కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఉమాపుత్ర ఉత్సవ కమిటీ తరపున పలు పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు,సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము,మట్టి గణపతుల వినియోగం ప్రాధాన్యతను తెలియజేస్తూ, భక్తులను మట్టి గణపతులను ప్రతిష్టాపన చేయాలని ప్రోత్సహించడం మా లక్ష్యం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా, ఆనందదాయకంగా జరుపుకుందాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
మేము ప్యారిస్ లేన్ ప్రాంతంలో గత సంవత్సరం వినాయక నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించాం. కేవలం మండపాన్ని రూపొందించడం, మండపంలో గణపతిని ప్రతిష్టించడం, తొమ్మిది రోజులపాటు పూజలు చేయడం, తర్వాత  నిమజ్జనం చేయడం…. ఇది మాత్రమే ఉత్సవం అని మేము భావించడం లేదని. ప్రజల్లో ఆధ్యాత్మిక, దేశభక్తి పెంపొందించడంతో పాటు, సామాజిక సమైక్యత పెంపొందడానికి మేము ఈ ఉత్సవాలను వినూత్న రీతిలో జరుపుతున్నామని కోట సతీష్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఈ విషయంలో మేము సఫలీకృతమయ్యాం. మండపాన్ని ఆకర్షణీయంగా, అనేక రకాల, రంగురంగుల పుష్పాలతో, కరెన్సీ నోట్లతో అలంకరించడం, అమర్నాథ్ మంచులింగాన్ని మండపంలో స్థాపించడం… వంటి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యానగర్ ప్రాంతంలోని భక్తులనే కాకుండా కరీంనగర్ పట్టణంలోని భక్తులందరినీ ఇక్కడికి రప్పించి వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించడానికి ప్రయత్నం చేశామన్నారుఅదే ఒరవడిలో ఈ సంవత్సరం కూడా మేము ఆ భావనతోనే ఉన్నాం. మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలతో ఈ సంవత్సరం ముందుకు వస్తున్నాం. ముందుగా మేము  పార్వతీదేవి ముద్దుల తనయుడైన వినాయకుని పేరుతో ‘ఉమాపుత్ర ఉత్సవ కమిటీ’ని ఏర్పాటు చేసుకున్నాం. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించబోతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు,భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కథా కాలక్షేపం, పుష్పాలు, కరెన్సీ నోట్లతో అలంకరణ, కృష్ణలీల, మహా రుద్రాభిషేకం మొదలైన  విశేషమైన కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన సన్నాహాక కార్యక్రమంలో ఉమాపత్ర ఉత్సవ కమిటీ నామ ప్రకటన, లోగో మరియు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ నిర్వహించుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఉమాపుత్ర ఉత్సవ కమిటీ సభ్యులు రవి కుమార్, రాజు, వెంకన్న, సందీప్, సదానందం, రాములు, శ్రీనివాస్ రావు, సాయి.ఆనందరావు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల
వివరాలు……
తేది: 07-09-2024 శనివారం రోజు నుండి 15-09-24 ఆదివారం వరకు విఘ్నేశ్వర నవరాత్రుల కార్యక్రమ వివరములు
తేది: 07-09-2024 శనివారం రోజు గణపతి పూజ కార్యక్రమం
తేది: 08-09-2024 ఆదివారం రోజు భజన & ఆధ్యాత్మిక కథా కాలక్షేపం
తేది: 09-09-2024 సామవారం మహా రుద్రాభిషేకము
తేది: 10-09-2024 మంగళవారం రోజు మహా రుద్రాభిషేకము
(ఉదయం 9 గం|ల నుండి, రాత్రి 12 గం॥ల వరకు)
తేది: 11-09-2024 బుధవారం  ప్రత్యేక అలంకరణ
తేది: 12-09-2024 గురువారం రోజు ప్రత్యేక అలంకరణ, కృష్ణలీల, ఉండ్రాళ్లు, మొక్కజొన్న తెల్ల జిల్లేడు, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ… 
తేది:13-09-2024
14-09-2024
15-09-2024.శ్రీ కుబేర లక్ష్మి గణపతి అలంకరణ,కరెన్సీతో ప్రత్యేక అలంకరణ
(ఆదివారం వరకు)
కరెన్సీతో ప్రత్యేక అలంకరణలు నిర్వహించబడును…
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page