ఆగ్రా :
48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షానికి ఆగ్రా లోని చారిత్రక కట్టడమైన తాజ్ మహల్‌కు లీకేజీ ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు పురావస్తు శాస్త్ర వేత్తలు. గురువారం ఇక్కడ 151 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా..పరిసర ప్రాంతాలు జలమయ మయినట్లు అధికారులు తెలిపారు. తాజ్ మహల్ పైనున్న డోమ్ పై నుండి నీరు కారుతున్నట్లు గుర్తించినట్లు పురావస్తు శాస్త్ర వేత్త తెలిపారు. తాజ్ మహల్‌లోన తేమ కనిపించిందని, పై నున్న గోపురం రాళ్లకు పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని అనుమానించారు. వర్షం నిలిచి పోయాక మరమ్మతులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కు స్మారక చిహ్నంగా ఈ తాజ్ మహల్‌ను నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతుంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
భారీ వర్షాలకు తాజ్ మహల్‌లో లీకేజీ ?

- Advertisment -