Thursday, September 19, 2024

Health Tips : ప్రశాంతత కోసం కాసేపు ఏడవండి..!

Health Tips :  ఎవరైనా ఏడ్చినప్పుడు  పెద్దలు వెంటనే ఆ వ్యక్తి ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనుషుల గుండె తరుక్కుపోతుంది. అయితే పెద్దయ్యాక ఏడిస్తే బలహీనులన్నీ, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాలికల ఏడిస్తే వారిని బలహీనులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏడుస్తారు. కానీ ఈ ఏడుపు ఆరోగ్యానికి మంచిది అని, కన్నీళ్లు పెట్టుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడ్చినప్పుడు శరీరంలో ఆక్సి టోషిన్, ఎండార్పిన్  అనే హార్మోన్లు విడుదలవుతాయి దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏడుపు వల్ల   ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చేసిన అధ్యయనాలు తేలింది.  బహిరంగంగా కన్నీళ్లు పెట్టడం ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారని అంటున్నారు. మనుషులు ఏడ్చినప్పుడు వారి భావోద్వేగాలు అదుపులో ఉంటాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని.. ఇది మాత్రమే కాకుండా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడ్చినట్లైతే అది మీ మనసును రిలాక్స్ చేస్తుందని చెబుతున్నారు.   మానసిక స్థితి కలత చెందినప్పుడు లేదా విచారంగా ఉన్నప్పుడు మనం కొంత సమయం పాటున ఏడవడం ద్వారా   బాధ కాస్తంత పోయి మనసు ప్రశాంతంగా ఉండే అనుభూతి కలిగిస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page