వేతనాల పెంపుకు మంత్రి దామోదర రాజ నర్సింహా హామి
రేపటి నుండి విధులకు హాజరు..
ప్రకటించిన యూనియన్ ప్రతినిధులు
హైదరాబాద్ :
సమ్మె విరమించారు ఆరోగ్య మిత్ర ఉద్యోగులు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రలు మూడు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంఘ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా, సంస్థ అధికారులతో శుక్రవారం యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇందులో ప్రధాన డిమాండ్ అయిన క్యాడర్ గుర్తింపుతో పాటు వేతనం పెంచేందుకు మంత్రి అంగీకరించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఆరోగ్య మిత్రలను ఇక నుండి డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా గుర్తిస్తూ నెల వేతనం రూ. 19, 500 చెల్పింపుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మిగతా 8 గంటల పని, ఎక్స్‌గ్రేషియా, హెల్త్ కార్డులతో ఇతర సమస్యలపై తరువాత చర్చిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చల్లో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గిరి యాదయ్య, ఎం కుమార్, ఉపాధ్యక్షులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య మిత్రల సమ్మె విరమణ

- Advertisment -