Vishakapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఓ మద్యం బాబు తనకు అడిగిన బ్రాండ్ కావాలని వైన్ షాపు వ్యక్తిని అడిగాడు. దీంతో ఆ బ్రాండ్ లేదని చెప్పాడు. కానీ కోపంతో ఆ వ్యక్తి వైన్ షాపు నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగాడు. జనాలకు కావాల్సిన బ్రాండ్ లేకుంటే మద్యం షాపు ఎందుకని ప్రశ్నించాడు. దీంతో పెట్రోల్ తీసుకొచ్చి దుకాణాన్ని తగలబెట్టాడు. దీంతో వైన్ షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన పై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో మద్యం బ్రాండ్లపై పలు ఆందోళనలు జరుగుతున్నాయి.తెలంగాణలో, కర్నాటకలో లభించే మద్యం ఏపీలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా మద్యం షాపును తగలబెట్టడం ఆసక్తిగా మారింది.
అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని కోపంతో.. వైన్ షాపును ఏం చేశాడో తెలుసా?
- Advertisment -