Friday, September 12, 2025

వైశ్య కార్పొరేష‌న్ ఏర్పాటు పై హ‌ర్షం

సీఎం రేవంత్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

క‌రీంన‌గ‌ర్ , మార్చి 13 ( మానేరు జ‌న‌తా ):ఆర్య‌వైశ్య సామాజిక‌వ‌ర్గంలోని పేద‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయ‌డంపై ఆర్య‌వైశ్య సంఘం నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో ట‌వ‌ర్ స‌ర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి ట‌పాసులు కాల్చి స్వీట్లు పంచి సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా న‌గునూరి రాజేంద‌ర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆర్య వైశ్యులలోని పేద‌ల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక కార్యక్రమాలు చేశామ‌ని, గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టినా ఏర్పాటు చేయ‌లేద‌ని, సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త‌మ చిర‌కాల వాంఛ‌ను గుర్తించి వైశ్య కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి త‌మ క‌ల‌ను నేరవేర్చింద‌ని రాజేంద‌ర్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది వైశ్యుల విజ‌య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చొర‌వ చూపి వైశ్య కార్పొరేష‌న్‌కు నిధులు మంజూరు చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, వేములవాడ ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు బుస్స శ్రీనివాస్, మాజి సెన్సార్ బోర్డు మెంబర్ ఎస్ ఆర్ శేఖర్, జిల్లా ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శివనాథుని శ్రీనివాస్, వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, జిల్లా కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునిందర్, జిల్లా అర్ ఎం పి డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు దోంతుల మనోహర్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణు గోపాల్, అదనపు ప్రధాన కార్యదర్శి కోంజర్ల శ్రీకాంత్, పట్టణ సంఘం కార్యవర్గ సభ్యులు,అభ్యుదయ సంఘాల అధ్యక్షులు , కార్యవర్గంతో పాటు సేవా కేంద్రం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page