జగిత్యాల,జనత న్యూస్: ఈ నెల 30 నుండి మే1 వరకు కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు.హనుమాన్ జయంతి సందర్భంగా క్షేత్ర సంప్రదాయ సారముగా హోమ,పూజ,అర్చనాది సేవలతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా జయంతోత్సవము ఆహ్వాన ప్రతులను, పోస్టర్ ను కలెక్టర్ సోమవారం రోజున తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర,కలెక్టరేట్ ఏఓ.హన్మంత రావు,కొండగట్టు ఆలయ ఈఓ.చంద్ర శేఖర్,డిప్యూటీ ఈఓ అంజయ్య పాల్గొన్నారు.
30 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు..
- Advertisment -