GSLV-F14: భారత్ కు చెందిన ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్( శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వి ఎఫ్- 14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకే ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత సార్క్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వి ఎఫ్- 14 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ గురువారం అర్ధరాత్రి సార్ కు చేరుకొని కౌంట్ డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. జిఎస్ఎల్వీ 2,275 కిలోల బరువు ఉంటుంది. దీనిని ఇన్సాట్ -3 డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఇది వాతావరణ పరిశీలనలకు మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు.
GSLV-F14: నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ -ఎఫ్- 14..
- Advertisment -