మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగేలా భారత ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గతంలో అనేక రంగాల్లో ఎఫ్‌డీఐలు ప్రవేశించగా..నిబంధనలు సడలించడం లాంటి చర్యలతో తాజాగా రక్షణ, రైల్వే, బీమా, టెలికాం..వంటి రంగాల్లో పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రతీ సంవత్సరం 80 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వస్తుండగా, దీన్ని వంద బిలియన్ డాలర్లకు పెంచేలా ప్రోత్సాహక చర్యలు కొనసాగుతున్నాయని వాణిజ్య అంతర్గత విబాగం కార్యదర్శి అమల్దీప్ సింగ్ బాటియా తెలిపారు. టాటా, ఎల్‌అడ్‌టీ, భారత్ పోర్టు లాంటి కంపెనీలు వందల కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు చేసుకున్న డీపీఐఐటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే..ఎఫ్‌డీఐ లను కమ్యునిస్టు పార్టీలు మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. వీటివల్ల కుల వృత్తులు దెబ్బతింటాయని, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని వామపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. రైల్వే, బీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆయా శాఖల ఉద్యోగులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

- Advertisment -