చిగురుమామిడి జనత న్యూస్:చల్లగా చూడు పోచమ్మ తల్లి అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున ఆదివారం బోనాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం సభ్యులు ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల మధ్య గ్రామ శివారులోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,వర్షాలు సమృద్ధి కురిసి పంటలు బాగా పండాలని… గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని కోరారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పోచమ్మ తల్లికి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో మున్నూరు కాపు సంఘం సభ్యులంతా ఐక్యతతో ఉంటూ భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పత్తెం వీరస్వామి,తాజామాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్,మండల ఉపాధ్యక్షుడు చిట్టంపల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు తులాల కనకయ్య,కార్యదర్శి తులాయిల సుధాకర్,కోశాధికారి సుంకరి శ్రీనివాస్,జర్నలిస్టులు పత్తెం శ్రీనివాస్,పత్తెం రమేష్,కార్యవర్గ సభ్యులు ఆకుల రాజు,బొగ్గుల సంతోష్,చిల్ల వెంకటేశ్వర్లు,ఆవుల వెంకటనారాయణ,సత్యం, రాయమల్లు,మిడివేల్లి వెంకటయ్య,శ్రీమూర్తి సాయిరెడ్డి,శ్రీమూర్తి అశోక్,తులైల వెంకటేశ్వర్లు,శ్రీమూర్తి శ్రీనివాస్, గంగిపల్లి శ్రీధర్,పత్తెం శ్రీనివాస్,గంగిపల్లి సురేష్, పత్తెం శ్రీకాంత్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా పోచమ్మ బోనాలు…
- Advertisment -