జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఆదివారం హనుమాన్ దీక్ష స్వాములు పంచముఖ హనుమాన్ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కలిశస్థాపన, నవగ్రహాల పూజ, పంచామృత అభిషేకం, పాలాభిషేకం, పూర్ణాహుతి మొదలగు పూజా కార్యక్రమాల ద్వారా హనుమాన్ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమురె మల్లేశం గౌడ్, ఆలయ పూజారి కాచం వెంకటేశం , దొమ్మాటి శ్రీకాంత్, అన్నాడి శ్రీనివాస్ రెడ్డి, మాసం స్వామి, అన్నాడి తిరుపతిరెడ్డి, కొమిరే వంశీ, కళ్ళేపల్లి శ్రీనివాస్,కొమిరే వర్ధన్, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హనుమాన్ హోమం
- Advertisment -