నగరంలో ఆర్యవైశ్యుల నిరసన
కరీంనగర్`జనత న్యూస్
పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయ పేరు మార్పును వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఆర్యవైశ్య కేంద్రం ప్రతినిధులు. కరీంనగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట ప్ల కార్డులతో నిరసన చేసిన ప్రతినిధులు..ప్రెస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సాధనలో 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారని ఆర్యవైశ్య కేంద్రం అధ్యక్షులు చిదురు సురేశ్ గుర్తు చేశారు. స్వాతంత్రోద్యమంలోనూ పొట్టి శ్రీరాములు పాల్గొన్నారని..ఆర్యవైశ్యులకే కాకుండా యావత్ జాతి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషిని వివరించారు. ఇవేమీ ఆలోచించకుండా..సీఎం రేవంత్ రెడ్డి విశ్వ విద్యాలయానికి పేరు మార్చడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని..లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కేంద్రం కోశాధికారి ముస్త్యాల రమేశ్, డైరెక్టర్స్ ఎలగందుల మునీందర్ ,కైలాస నవీన్, రామీడి శ్రీధర్, తాటి పెళ్లి సుభాష్, బొల్లం శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, గౌరిశెట్టి సుమన్, తుడుపునూరి హరి , ఎలుగూరి రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని.. వెనక్కి తీసుకోవాలి
- Advertisment -