కోరుట్ల, జనతా న్యూస్ : కోరుట్ల పట్టణంలోని చిరు వ్యాపారస్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని 6 గ్యారెంటీల పథకాలు ఇవ్వాలని కోరుట్ల చిరు వ్యాపారస్థుల సమాఖ్య అధ్యక్షుడు షాహద్ మహ్మద్ షేక్ , చిరు వ్యాపారులు కలిసి కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జాతీయ చిరు వ్యాపారస్థుల సమాఖ్య అధ్యక్షుడు షాహద్ మహ్మద్ షేక్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ రికార్డ్ ప్రకారం 4 వేల మంది చిరు వ్యాపారస్థులు ఉన్నారు. అయితే ప్రభుత్వం జీవోల ప్రకారం వీరికి, ఇండ్లు, ఫెన్షన్, సిలెండర్లు విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నాయియనీ పేర్కొన్నారు.మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారస్థులకు ఎలాంటి సహాయం చేయలేదుని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలు చిరువ్యాపరస్థులకు అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మక్క, బాలక్క, జీ. మలవ్వ, వాణీ తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఆదుకోవాలి
- Advertisment -