Danial Balaji: చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మరణించారు. చాతిలో నొప్పి కారణంగా చెన్నై నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పలు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటిలో ‘వడ చెన్నై’, ‘కాకా కాకా‘, ‘వట్టయాడు విళయాడు’ ఉన్నాయి. తెలుగులో ఘర్షణ, టక్ జగదీష్ సినిమాల్లో కనిపించారు. టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన డేనియల్ ‘చిట్టి’ తో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళం లో కలిపి దాదాపు 40 సి నిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల తమిళంతో పాటు తెలుగు సినిమా నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
‘ఘర్షణ’ నటుడు డేనియల్ బాలాజీ మృతి
- Advertisment -