రోజురోజుకు నిత్యావసరాల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న ఉల్లి గడ్డ.. నిన్న టమాట.. ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎల్లిగడ్డ ధరలు భయం పుట్టిస్తున్నాయి. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో కిలో ఎల్లిగడ్డ రూ.400 పలికింది. గతంలో రూ.100 లోపే ఉండగా.. సంక్రాంతి పండుగకు రూ.180 నుంచి రూ.240 వరకు విక్రయించారు. ఆ తరువాత రూ.360 నుంచి ఏకంగా రూ. 400 పెరిగింది. వెల్లుల్లిని ఎక్కువగా మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలోని వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు దిగుమతి చేసుకుంటారు. అయితే భారీ వర్షాల కారణంగా ఎల్లిగడ్డ దిగుమతి ఎక్కువ కాలేదు. దీంతో నిల్వలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రూ.400 తో విక్రయించడంతో కొందరు సగం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
వెల్లుల్లి @ 400..కారణం ఇదే..
- Advertisment -