విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా అంజలి కీలకపాత్రలో కనిపిస్తుంది. 1960 నాటి గోదావరి జిల్లాల పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో చీకటి ప్రపంచంలో సామాన్యుడు నుంచి అసామాన్యుడిగా ఎదిగిన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. తర్వాత మార్చి 8న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఇదే తేదీలో విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ రిలీజ్ అయింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో మే 17కు వాయిదా వేశారు.
మరోసారి వాయిదా పడ్డ ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’
- Advertisment -