Tuesday, July 1, 2025

హైదరాబాద్‌లో గణేష్‌ ప్రతిమలు ఎన్నంటే..

 

భాగ్య నగర్‌లో సుమారు లక్షా 40 వేల మండపాల్లో గణేష్‌ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఏ గల్లీకి చూసినా విభిన్న గణనాథుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 72 అడుగుల ఫేమస్‌ ఖైరతాబాద్‌ లంబోధరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. బాలాపూర్‌, ఇతరాత్ర గణపతి విగ్రహాలు ఆకర్శనీయంగా దర్శనమిస్తున్నాయి. తండోప తండాలుగా వస్తూ ఆయా మండపాల్లో భక్తులు గణపతిని దర్శించుకుంటున్నారు.
ఈ సారి బాగ్య నగర్‌లోని అన్ని ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నవరాత్రులూ రాష్ట్ర రాజధాని భక్తులచే కళ కళ లాడనుంది. తొలిరోజు సీఎం రేవంత్‌ రెడ్డి ఖైరతాబాద్‌లో ప్రత్యేక పూజలు చేయగా, ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు గణ నాథునికి పూజలు చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page