తెలంగాణ విమోచన వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్రం భాగస్వామ్యం
వాస్తవాలు తెలిపేందుకే మూడేళ్లుగా వేడుకలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర విభాగాల అధికారులు
హైదరాబాద్ :
గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల తరహాలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యమౌతుందన్నారు. తెంగాణ అభివృద్ధికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాకారం మరువ లేనిదన్నారు. భవిష్యత్తులోనూ ఈ సహకరాన్ని కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన..రాజకీయాలను పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. భావితరాలకు వాస్తవాలు తెలువాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తోందని.. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం ఏ వర్గానికో, ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదన్నారు. దేశభక్తులకు, దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటమని..దేశాన్ని ఐక్యం చేసే నినాదంతోనే ‘ఆపరేషన్ పోలో’ పేరుతో పోలీస్ యాక్షన్ షురూ చేసి నిరంకుశ నిజాం నుండి విముక్తి కల్పించారని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేరిందని, భారతదేశం సాధిస్తున్న ప్రగతిని లోకమంతా కీర్తిస్తుందన్నారు. ప్రజా పాలన దినోత్సవం అంటే ఒక్క రోజే పాలన చేసి, మిగిలిన రోజులు దోసుక తినడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 గ్యారంటీ లను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ‘ప్రజా పాలనా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాలా..అ ని ప్రశ్నించారు. పిడికెడు మంది రజకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయమో ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఎస్.భట్టి , సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్ , కేంద్ర సాంస్క్ర్రతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి తదితరులు పాల్గొన్నారు.