కరీంనగర్, జనతాన్యూస్: ప్రజలు స్వేచ్ఛ ఓటుకు పూర్తి స్థాయిలో భద్రతకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు తెలిపారు. గురువారం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు మండల కేంద్రంలో, గోపాలరావుపేటలో ఆయన జెండా ఊపి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు మాట్లాడుతూ దాదాపు 80 మంది పోలీసులతో మండల కేంద్రంలో మరియు గోపాల్ రావుపేట గ్రామంలో ఈ కవాతు నిర్వహించామన్నారు . ఈ కవాతులో కేంద్ర సాయుధ బలగాలతో పాటు జిల్లా పోలీసులు, స్థానిక పోలీస్ అధికారులు, జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పాల్గొన్నాయన్నారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా కేంద్ర సాయుధ బలగాలు జిల్లాకు కేటాయించారన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కేంద్ర సాయుధ బలగాలు జిల్లా అధికారులతో కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల్లో ఎన్నికల నియమావళి , ఉల్లంఘనలు , 100 డయల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ , సి- విజిల్ ఆప్ ల పై అవగాహన కల్పించామన్నారు. ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతాభావాన్ని కల్పించడమే కాకుండా చట్టాన్ని, ఎన్నికల నియమాలని ఉల్లంఘించే రాజకీయ ట్రబుల్ మాంగర్స్ , రౌడీ షీటర్స్ ని పిలిపించి ప్రజల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించామన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, బి.ఎస్.ఎఫ్. ఇన్స్పెక్టర్ విపిన్ సింగ్,అభయ్ సింగ్, ఇన్స్సెక్టర్లు గోపతి రవీందర్ (చొప్పదండి), ఎస్సైలు ఉపేంద్ర చారి (చొప్పదండి ), తోట తిరుపతి (రామడుగు), అభిలాష్ (గంగాధర) మరియు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రజల స్వేచ్ఛ ఓటుకు పూర్తి స్థాయిలో భద్రత:ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు
- Advertisment -