న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో పాటు జ్వరం ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను పూణెలోని భారతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నామన్నారు. ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు.
Former President Pratibha Patil admitted to Bharti hospital in Pune, condition stable
Read @ANI Story | https://t.co/feWIPKNdaF#PratibhaPatil #Pune pic.twitter.com/wNdyHTqB89
— ANI Digital (@ani_digital) March 14, 2024