Wednesday, September 10, 2025

పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి

పెద్దపెల్లి,జనత న్యూస్ : పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. నెలరోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి సోమవారం విషమించడంతో తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బిరుదు రాజమల్లు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిరుదు రాజమల్లు పెద్దపల్లి లోని సుల్తానాబాద్ లో 1930 లో జన్మించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ తరుపున వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్ గా మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 లో మరోసారి పోటీ చేసి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత టీడీపీలోనే కొనసాగిన బిరుదు రాజమల్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2018 లో టీఆర్ఎస్ లో చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి అభ్యర్థి విజయరమణారావుకు మద్దతుగా నిలిచారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page