జనత న్యూస్ బెజ్జంకి : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కమిటీల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులవుతారని భావించి మహిళకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహిళా సమైక్య సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో బుధవారం ప్రైమరీ, హై స్కూల్ లలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు గ్రామ వివో ఏలు బెజ్జంకి వీణ, బుర్ర అంజలి పేర్కొన్నారు. హై స్కూల్ కమిటీ అధ్యక్షులుగా పైడిపాల రమ్య, ప్రైమరీ స్కూల్ అధ్యక్షులుగా బెజ్జంకి రేణుక, కమిటీ కన్వీనర్లుగా ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, బోనాల రాజేందర్ నియామకమయ్యారు. విద్యార్థుల తల్లులు కమిటీ మెంబర్లుగా నియమించబడ్డారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు
- Advertisment -