పీఎం జుగాకు సన్నాహాలు
అక్టోబర్-2న మహత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అత్యంత వెనుకబడ్డ గిరిజనుల కోసం ప్రధాన మంత్రి జన జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించనుంది. దీనివల్ల తెలంగాణలోని 924 గిరిజన ప్రాంతాల్లోని వారికి లబ్ధి చేకూరనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆయా ప్రాంతాల్లో ఇండ్లు, విద్యుత్, తాగునీరు, హెల్త్ కార్డులు అందించడంతో పాటు రోడ్లు, ఇంటర్నెట్ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించనుంది. గిరిజనులకు వృత్తిలో నైపుణ్యం కల్పించి మెరుగైన ఉపాధి, విద్య అవకాశాలు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు పీఎం జుగా స్కీమ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలు ముమ్మరం చేసిన కేంద్రం..తాగా అడవీ ప్రాంతాల్లోని గిరిజనులు మావోలకు దూరం అయ్యేలా ప్రభుత్వం వారిలో మార్పు తీసుకొచ్చే మరో ప్రయత్నం చేస్తుంది.