రైతులకు రాజన్న కోడెలు
నేటి నుండి పంపిణీ షురూ !
గోషాలకు రూ. కోటి 11 లక్షలు మంజూరు
పకడ్భందీగా కోడెలు, గోవుల రంక్షణ
అర్హులకు కోడెలను పంపిణీ చేసిన విప్ ఆది
వేములవాడ-జనత న్యూస్
వేములవాడ రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అర్హులైన రైతులు, గోశాల యజమానులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaూతో కలసి పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిప్పాపూర్ గోషాలలో 1500 లకు పైగా కోడెలు, ఆవులు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయని తెలిపారు. ఇందులో 400 గోవులు, కోడెలను తాము సంరక్షిస్తూ..మిగతా వాటిని అర్హులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం చేసే ప్రతీ పేదకు రెండు కోడెలను చొప్పున అందిస్తున్నామన్నారు. వీటిని జాగ్రత్తగా, దైవ రూపంగా భావించి చూసుకోవాలని, ఇతరులకు విక్రయించరాదని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటి వినియోగం పై పకడ్బందీగా అంగీకార పత్రం తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రa మాట్లాడుతూ దేవస్థానంలోని కోడెలను పేద రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఒప్పించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన రైతులను ప్రత్యేక కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి ఎంపిక చేసామన్నారు. దేవస్థాన గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. కోటి 11 లక్షల లను మంజూరు చేసిందని, వీటితో గోశాలలో అదనపు షెడ్లు, సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.