నగునూర్ శ్రీ దుర్గా భవనీ ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు
కాశింపేట మానసా దేవి ఆలయంలో భక్తుల సందడి
జనత న్యూస్ నెట్‌వర్క్ :
ఆషాడ మాసం సందర్భంగా దేవాలయాలు భక్తులచే కిట కిట లాడుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆషాడ శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారిని కరివేపాకు మాల లతో అలంకరించారు. విశేష హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని చీరె`సారె సమర్పించి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయంలో సుహాసినీల సౌందర్య లహరి పారాయణం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ధర్మం రక్షణ కవచం వంటిదని దాన్ని ఆచరించడం అందరి కర్తవ్యమని, ధర్మాచరణ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మన్, కమిటి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మానసా దేవి ఆలయంలో..
గన్నేరువరం మండలం కాశింపేట స్వయంభు మానసా దేవి ఆలయంలో ఆషాడ మాస వేడుకలు కొనసాగుతున్నాయి. మొదటి మంగళవారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మానసా దేవి ఉత్సవ మూర్తికి పాల అభిషేకం చేశారు. తమ కోర్కెలు తీరాలని ముడుపు కట్టి మొక్కుకున్నారు. కుంకుమ పూజలు, అమ్మ వార్లకు ఓడి బియ్యం పోసి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్ధం చిన్న నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రా రెడ్డి, ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.