రూ.600 కోట్లతో యాంత్రీకరణ పనిముట్లు
త్వరలో రైతు రుణమాఫీ నాలుగో దశ నిధులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
అక్టోబర్ 1నుండే ధాన్యం కొనుగోళ్లు..
బీసీ సంక్షేమ మంత్రి పొన్నం
ఘనంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం
గజ్వేల్-జనత న్యూస్
చిన్న సన్నకారు రైతుల కోసం రూ. 600 కోట్లతో యాంత్రీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇంఛార్జి మంత్రి కొండ సురేఖతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కోసం 31వేల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ. 18 వేల కోట్లు మంజూరు చేశామని మిగతా రైతులకు త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పామాయిల్ పంట వైపు రైతులు దృష్టిని సారించి ముందుకు రావాలని, సాగు, మార్కెటింగ్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ామ్‌ఆయిల్ పంట సాగులో ఖమ్మం జిల్లా ఇప్పటికే ముందున్నదని, తాను కూడా పామ్ ఆయిల్ పంటను సాగు చేస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు. సిద్దిపేట జిల్లా రైతులు కూడా పామ్ ఆయిల్ పంటను సాగు చేసి సాగులో ఖమ్మం జిల్లాను దాటి పోవాలని ఆకాంక్షించారు. రైతులు ఒకే విధమైన పంట సాగు వైపు కాకుండా మిశ్రమ పంటలను సాగు చేయాలన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతులు మద్య దళారులను నమ్మి ధాన్యం అమ్ముకొని నష్ట పోకుండా రాష్ట్రంలో 1వ తేదీ నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంఛార్జి మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తూ, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం 6 గ్యారెంటీలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. నూతన పాలక వర్గం నిరంతరం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని పిలుపు నిచ్చారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్ మరియు పాలక సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ రఘోత్తం రెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంఘం అద్యక్షులు మెట్టు సాయి, డీసీసీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, పాలక సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.
సన్న, చిన్నకారు రైతులకు..

- Advertisment -