ఆధార్ తరహాలో ఈ కార్డు ఇవ్వాలని నిర్ణయం
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
తహెర్ కొండాపూర్‌లో క్షేత్ర స్థాయి పరిశీలన
కరీంనగర్-జనత న్యూస్
డిజిటల్ కార్డుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, ఫించను, ఇతర ప్రభుత్వ పథకాలన్నింటికీ..ఈ కార్డే ప్రమాణికంగా పని చేస్తుందని ఆయన స్ఫష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం తహెర్ కొండాపూర్‌లో కుటుంబ సభ్యుల వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో లాంచనంగా ప్రారంభించారని, 119 నియోజక వర్గాల్లో 2880 ప్రాంతాల్లో పాయిలెట్ ప్రాతిపదికన వివరాల సేకరణ కొనసాగుతుందన్నారు. నియోజక వర్గంలోని ఒక గ్రామం, మున్సిపాలిటీలోని వార్డు పాయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వివరించారు. మహిళ పేరుపై మాత్రమే కార్డు జారీ అవుతుందని, సర్వేలో ఆస్తుల వివరాలేవీ అధికారులు అడగరని, పోటో మాత్రమే తీసుకుంటారని తెలిపారు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉండి పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు. కర్ణాటక, హర్యానా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ డిజిటల్ కార్డులను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే రూ. లక్షా , రూ. లక్షా 50 వేలు , 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని, కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచి పోయిన వారికి దసరా లోపు మాఫీ అవుతాయన్నారు. అర్హత ఉండి ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే అధికారులకు వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. మంత్రి వెంట ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో, కాంగ్రెస్ నియోజక వర్గ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్ ఉన్నారు.
పభుత్వ పథకాలన్నింటికీ డిజిటల్ కార్డే ప్రామాణికం

- Advertisment -