తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం
జనత :
తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేలు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, కూలిపోయిన ఇండ్లకు ఇందిరమ్మ పథకం కింద మంజూరు..ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరా సాయం ప్రకటించినా ఇవి సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి దన్నుగా తామున్నామని, మరింత సాయం అందేలా అండగా ఉంటామని ముందుకొస్తున్నారు ప్రముఖులు, ఉద్యోగులు.‘ ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్నా’ అన్నట్లు ప్రముఖ సినీ హీరో జూనియర్ తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సైతం తమ ఒక రోజు వేతనం రూ. 100 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఇలా మరికొందరు ముందుకొచ్చి తమ వంతు సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.