60 మంది మృతి, 44 మంది గల్లంతు..
ఖాట్మండు:
నేపాల్‌లో వరద భీబత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాతతో ఆ దేశం అతలా కుతలం అవుతోంది. ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లు భవనాలను వరద ముంచెత్తడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే సుమారు 60 మంది మృతి చెందగా, 44 మంది వరదల్లో గల్లంతయ్యారు. రాజధానిలో వరదలు వచ్చే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో సుమారు మూడు వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రాణ నష్టం భారీగా జరిగినట్లు అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఖాట్మండు లోయలో 34 మంది ఇతర ప్రాంతాల్లో పౌరులు మృతి చెందారని పోలీసు డిప్యూటీ అధికారి బిశ్వో తెలిపారు. ఖాట్మండులో 226 ఇళ్లు మునిగిపోయాయని, దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్‌ను ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొన్నారని నేపాల్ పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా సహాయక చర్యల్లో ఆటంకాలు ఎదురౌతున్నట్లు వారు తెలిపారు.
నేపాల్‌లో వరద భీబత్సం

- Advertisment -