జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న బోయిని సరవ్వ అనారోగ్యంతో మరణింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట డిపిఓ దేవికా దేవి శనివారం గుగ్గిళ్ళ గ్రామానికి చేరుకొని కార్మికురాలి కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామపంచాయతీ తరపున గుగ్గిళ్ళ గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి దహన సంస్కరణల కోసం పదివేల రూపాయలు మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ విష్ణువర్ధన్, పంచాయతీ కార్యదర్శి మహిపాల్, కారోబార్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
దహన సంస్కరణలకు ఆర్థిక సహాయం
- Advertisment -