Thursday, September 19, 2024

Fennel Sead Water:సోంపు వాటర్ తో డీహైడ్రేషన్ దూరం

Fennel Sead Water: ఎండవేడి, డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం  కోసం నిమ్మరసం, షికంజి, షర్బత్తు, చెరుకు రసం వంటివి తీసుకుంటారు. ఇవి శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితోపాటు వేసవిలో ఉపశమనాన్ని అందించే సోంపు వాటర్ తాగడం కూడా శరీరానికి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సోంపు వాటర్ తో శరీరం చల్లగా మారుతుంది.  ఇది కూలింగ్ ఎఫెక్ట్ ని కలిగి ఉంటుంది. సోంప్ వాటర్ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, డీహైడ్రేషన్ సమస్యను కూడా దూరంగా ఉంచుతుంది. సోంప్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అనేక రకాల విటమిన్లు కూడా ఉంటాయి.  సోంపు జీర్యశక్తిని మెరుగుపరచడంతో పాటు ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపులో జింక్ ఫాస్ఫరస్, సెలీనియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ అధిక పరిణామాలుగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు సోంపును, సోంపు వాటర్ ను  తీసుకోవచ్చు. శరీర బరువులు నియంత్రించేందుకు ఫైబర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోంపు నీరు తాగడం వల్ల శరీర బరువును కూడా సులభంగా తగ్గిస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page