జనత న్యూస్ బెజ్జంకి :మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామ సర్పంచ్ కుసుంబ అంజవ్వ బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. యువ నాయకులు కుసుంబ సంపత్ రావు ఉప సర్పంచ్ కుంట హరికృష్ణ వార్డ్ మెంబర్ పద్మా చంద్రయ్య లు పలువురు బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వీరిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కవ్వం సత్యనారాయణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కస రత్నాకర్ రెడ్డి రావుల నరసయ్య జెల్ల ప్రభాకర్ అక్కరవెనీ పోచయ్య, రాజు, చెన్నారెడ్డి, మానాల రవి బోనగిరి మధు, శనగొండ శ్రావణ్ శరత్, బొనగము రాజు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ ను వీడిన మహిళా సర్పంచ్ ఉప సర్పంచ్
- Advertisment -