హైదరాబాద్, జనతా న్యూస్: ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి ఆ తరువాత తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోయినిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓల్డ్ బోయినిపల్లి లోని భవాని నగర్ లో నివాససం ఉంటున్న శ్రీకాంతచారి స్వర్ణకారుడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో తరుచూగొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య బాగానే ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం శ్రీకాంత చారి తన కూతుళ్లు శ్రావ్య, స్రవంతిలకు నిద్రమాత్రలు ఇచ్చి తాను కూడా మింగాడు. దీంతో కూతుళ్లతో పాటు తండ్రి మరణించాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో భవాని నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఈఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసుకున్నారు.
ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య..
- Advertisment -