ఇల్లంతకుంట జనతా న్యూస్ రైతు పండించిన ధాన్యం కొనుగోళ్ళు సకాలంలో జరగక సెంటర్లోనే మగ్గిపోవడం అనుకోని వర్షాలు కుర్వడంతో రైతన్న లు ఆగమవుతున్నారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రభుత్వం సేకరించడంలో ఆలస్యం అవ్వడం తో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు సెంటర్ ప్రారంభమై దాదాపుగా రెండు మాసాల అవుతున్నా ధాన్యం సెంటర్లోని మగ్గిపోవడంతో మా ధాన్యం ఎప్పుడు పోతుందో అని సెంటర్లోనే రోజుల తరబడి పడి కాపులు కాస్తున్నారు రైతు పంట పండించడం ఓకెత్తైతే పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం పెద్ద భారమవుతుందని రైతులు అంటున్నారు. ఇల్లంతకుంట మండలంలో ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్లు కలిపి 20 కి పైగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు ఈ సెంటర్లు ప్రారంభమై రెండు నెలలు సమీపిస్తున్న రెండు మూడు సెంటర్లు మినహా పలు గ్రామాల్లో దాన్యం నిలువలు పూర్తిస్థాయిలో పోలేదు మండలంలోని అనంతారం, పెద్ద లింగాపూర్, దాచారం, వెల్జిపూర్ ,పొత్తూరు తదితర గ్రామాల్లో ధాన్యం నిల్వలకు సరిపడా కొనుగోళ్ళు జరగకపోవడం సరిపడా లారీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మండలంలో ప్రతి యాసంగి సీజన్లో 3 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం సేకరిస్తారు కానీ ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు సుమారు లక్షా 70 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు కొందరు రైతులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోగా ఇంకా దాదాపు 60 వేలకు క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వలు ఉన్నట్లు అధికారుల అంచనా ద్వారా తెలిసింది ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి కొనుగోలు తొందరగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు
అకాల వర్షాలతో రైతులు ఆగమాగం..
- Advertisment -