బెజ్జంకి టౌన్, జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్ద లింగాపూర్, అంతగిరి గ్రామాలకు చెందిన రైతులంతా కలిసి పెద్ద లింగాపూర్ లో శుక్రవారం రాస్తారోకో, ధర్నా చేపట్టి తమ వ్యవసాయ పొలాలలో ఉన్న వరి పంట పొట్ట దశలో ఉందని, తమ బావులు అన్నపూర్ణ డ్యాం నిర్మాణం చేసే క్రమంలో కాలువలలో పోయాయని, ప్రస్తుతం డ్యామ్ లో చుక్క నీరు లేదని పలువురు రైతులు ఆవేదన వెల్లబుచ్చారు. జిల్లా కలెక్టర్ వచ్చేంతవరకు తాము కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ కింద 500 ఎకరాలలో వరి పంట సాగు అవుతుందని, పొలాలు ఎండిపోతున్నాయని, తమకు తక్షణమే నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట ఎస్సై దాస సుధాకర్ సంఘటన స్థలానికి వెళ్లి వారిని శాంత పరిచారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగునీరు ఇప్పించడానికి కృషి చేస్తానని తెలిపినారు. ఎస్ఐ హామీ తో రైతులు ధర్నా కార్యక్రమం విరమించారు.
Bejjenki : సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు
- Advertisment -