హైదరాబాద్, జనతా న్యూస్: ప్రముఖ సింగర్ మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో మంగ్లీ కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ లోని కన్హలో జరిగి ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరైన ఆమె తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో శంషాబాద్ తొండపల్లి సమీపంలో బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్ లు ఉన్నారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మంగ్లీ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలియడంతో ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ప్రముఖ సింగర్ మంగ్లీకి తప్పిన ప్రాణాపాయం
- Advertisment -