- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన
- -+94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చిన మోసపూరిత వాట్సాప్ మేసేజ్
సిరిసిల్ల,జనత న్యూస్: జిల్లాలో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో తన పేరిట వచ్చే తప్పుడు కథనాలను, +94755455869 గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మేసేజ్ లను జిల్లా అధికారులు,సిబ్బంది,ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.జిల్లా కలెక్టర్ పేరిట మోసపూరిత మేసేజ్ లు, పలు తప్పుడు కథనాలు, వాట్సాప్, ఫేస్ బుక్ మరియు వివిధ సోషల్ మీడియాల్లో ప్రచారం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ప్రజలు వీటిని ఎవరూ నమ్మవద్దని అలాగే ఈలాంటి మేసేజ్ లు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.