- నలుగురు వ్యక్తులపై కేసు నమోదు
- ఇద్దరు జైలుకు ..పరారీలో మరో ఇద్దరు…
కరీంనగర్,జనత న్యూస్:నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి..విక్రయించిన భూమిని తిరిగి అక్రమించిన తతంగంలో నలుగురు వ్యక్తులపై పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇద్దరిని జైలుకు పంపించారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ అదివారం తెలిపారు.కేసు వివరాలను ప్రదీప్ కుమార్ వెల్లడించారు.కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య (54) పవర్ లూమ్ నందు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరీంనగర్ తీగలగుట్టపల్లి లోని సర్వేనెంబర్ 233/E నందు గల ప్లాట్ నెంబర్ 16, తూర్పు ముఖముగా 50 ఫీట్ల వెడల్పు రోడ్డు కలిగిన 293.33 చదరపు గజాల స్థలాన్ని 2003 సంవత్సరంలో మూల గౌరా రెడ్డి వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మూల గౌరా రెడ్డి మరణానంతరం అతని కొడుకు మూల తిరుమలరెడ్డి గతంలో తమకు విక్రయించిన తమ ప్లాట్లకు గల 50 ఫీట్ల రోడ్డు వారికి చెందిందేనని, దానిని ఆక్రమించి రెండు ప్లాట్లుగా విభజించి తిరుమల రెడ్డి తల్లి మూల వీరమ్మ పేరునా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మూల సూర్య ప్రకాష్ రెడ్డి,లంక శేఖర్ లకు విక్రయించినట్లుగా తప్పుడు దృవపత్రాలను సృష్టించాడు.దృవపత్రాల ఆధారంగా గోడను సైతం సృష్టించారని విచారణ జరిపి న్యాయం చేయాలనీ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.ఫిర్యాదులో తెలిపిన వివరాలు విచారణలో బహిర్గతమవ్వడంతో తప్పుడు దృవపత్రాలు సృష్టించి విక్రదారుడు తిరుమల రెడ్డి,లంక శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో హజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించగా జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.