హుస్నాబాద్, జనతా న్యూస్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయనాయకులు ప్రచారాన్ని జోరు పెంచారు. బీఆర్ఎస్ అభ్యర్థులు మరోసారి తమ ప్రభుత్వం వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా ప్రజల్లోకి తిరుగుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా వొడితెల సతీష్ బాబు గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ.. ప్రజా సంక్షేమమే థ్యేయంగా పనిచేస్తున్న వొడితెల సతీష్ బాబును గెలిపించాలని కోరుతున్నారు.
హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
- Advertisment -