Saturday, July 5, 2025

Worldcup 2023 : చెలరేగిన ఇండియా.. ఫైనల్ కు అర్హత..

Worldcup 2023 :వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ పై ఇండియా జయభేరి మోగించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ముంబయ్ లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. అలాగే భారత బౌలర్లు సైతం 7 వికెట్లు పడగొట్టి కివిస్ ను మట్టి కరిపించారు. ఓవరాల్ గా 9.5 ఓవర్లు వేసిన షమి 57 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీసి అజేయంగా నిలిచేలా చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ పట్టిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేశారు. ఓపెనర్ గా దిగిన కెప్టెన్ (47) సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. ఆయనకు తోడుగా శుభ్ మన్ గిల్ 80 పరుగులు చేశాడు. ఆ తరువాత బరిలోకి దిగిన కోహ్లి 117 తో రికార్డు సెంచరీ చేశాడు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ సైతం దూకుడుగా వ్యవహరించి 105 పరుగులు చేయడంతో భారత్ స్కోరు అమాంతం పెరిగింది. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన కివిస్ కు మొదటి నుంచే భౌలర్లు చుక్కులు చూపించారు. వీరిలో షమీ పరుగులు ఇచ్చినా 7 వికెట్లు తీయడంతో కివిస్ పతనమైంది. దీంతో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page