Sunday, July 6, 2025

సీఎం పదవి పై వీడని ఉత్కంఠ…

  • మంత్రివర్గంలో చోటు దక్కేదేవరికి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణకు కాబోయే రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు మొదలయ్యాయి.
(యాంసాని శివకుమార్ -ఎడిటర్)

తెలంగాణలోని ఏ జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందనే అంచనాల్లో ప్రజలు మునిగితేలుతున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకున్న వారందరికీ కొత్త మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందనే వాదన బలంగా వినపడుతోంది. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు వారి సామాజిక వర్గాల నుంచి అవకాశం దక్కుతుందనేది సమాచారం.

మహిళ, ఎస్టీ, బీసీ కోటాల నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. బ్రాహ్మణ వర్గం నుంచి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం దక్కవచ్చని సమాచారం. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో జి. వివేక్‌ వెంకటస్వామికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నుంచి గెలుపొందిన సుదర్శన్‌రెడ్డి, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే చర్చ సాగుతోంది. సీనియర్లు, విద్యావంతులను స్పీకర్‌గానో, డిప్యూటీ స్పీకర్‌గానో నియమించాల్సి వస్తే.. సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మరొకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంటే కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు వెలమ సామాజిక వర్గం నుంచి అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇక సీఎం అభ్యర్థులుగా ప్రచారం పొందిన వారిలో ఒకరిద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదని కూడా కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్‌ నేత, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కోటాను మరింతగా విస్తరించాలని భావిస్తే, రజక సామాజిక వర్గానికి చెందిన శంకరయ్య పేరును పరిశీలించే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చినా.. సిటీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తే.. ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలోనే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ లోపుగానే మంత్రివర్గంలో ఉండేవారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉన్నవారు..

ఆదిలాబాద్ జిల్లా :
► వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్)
►ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల)
►వెడ్మ బోజ్జు ( ఖానాపూర్)

కరీంనగర్ :
►పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)
►శ్రీధర్ బాబు (మంథని)
►అది శ్రీనివాస్ (వేములవాడ)

మహబూబ్ నగర్ :
►రేవంత్ రెడ్డి..(కొడంగల్ )
►జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్)
►వంశీ కృష్ణ (అచ్చంపేట)
►వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ )

వరంగల్:
►సీతక్క (ములుగు)
►కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్)

ఖమ్మం:
►భట్టి విక్రమార్క (మధిర)
►తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం)
►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు)
► కునంనేని సాంబశివ రావు (కొత్తగూడెం)

నల్గొండ :
►ఉత్తమ్ లేదా పద్మావతి
►కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ)

మెదక్ :
►దామోదర్ రాజనర్సింహ (అందోల్ )

నిజామాబాద్ :
►సుదర్శన్ రెడ్డి ( బోధన్)
►షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి)

రంగారెడ్డి :
►మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం )
►గడ్డం ప్రసాద్ (వికారాబాద్)
►రామ్ మోహన్ రెడ్డి (పరిగి)

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page