మంథని జనతా, న్యూస్:మంథని పట్టణంలోని నృసింహ గార్డెన్ లో గురువారం వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు వివిధ ప్రాంతాల వేద పాఠశాల నుండి వచ్చిన 350 మంది వేద విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్టు అధ్యక్షుడు సాయినాథ శర్మ కార్యదర్శి బ్రహ్మానంద శర్మ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 5వ తేదీ రోజున ఉత్తీర్ణత పత్రాలు అందజేయబడతాయని వారు తెలిపారు. అలాగే వివిధ పాఠశాలలకు చెందిన 150 మంది ఆచార్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ ఉపనిషత్తులు వేదం యొక్క ప్రాముఖ్యతను గురించి భక్తులకు వివరించారు. ఉదయం గోపూజ తో ప్రారంభమైన కార్యక్రమం శుక్ల యజుర్వేద భవనం గురుపూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏర్పాట్లు సీతారామ సేవా సదన్ అధ్యక్షుడు న్యాయవాది కర్నే హరిబాబు పర్యవేక్షించారు. సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో గట్టు నారాయణ గురుజి అధ్యక్షతన తూములూరి సాయినాథ శర్మ ఎమ్మెల్యే లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వి సతీష్ కుమార్, చింతపల్లి సుబ్రహ్మణ్యం, మరుమాముల వెంకటరమణ శర్మ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.