కరీంనగర్,జనత న్యూస్: దేశ పౌరులుగా ఎన్నికల్లో తమ ఓటు హక్కును బాధ్యతగా అందరూ వినియోగించుకోవాలని వాసవి జాగృతి జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి అన్నారు.అదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి జాగృతి అధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై యువతకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి మాట్లాడుతూ ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని అన్నారు. ముఖ్యంగా యువతను జాగృతం చేసి ఓటు వేసేందుకు కృషి చేయాలని అన్నారు.వాసవి జాగృతి ప్రోగ్రాంను జిల్లాలోని అన్ని క్లబ్ లు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్,ఐపీసీలు చందా రవీందర్, ఎల్లెంకి ప్రదీప్, ఆర్ సీ అక్కెనపల్లి నాగరాజు, కేబినేట్ సెక్రటరీలు రాచమల్ల గాయత్రి, సూర గీత,సామ లక్ష్మన్,క్లబ్ అధ్యక్షులు బొడ్ల సంతోష్,చందా విజయలక్ష్మి,మాడిశెట్టి ఉమాదేవి,బొడ్ల శ్రవణ్ కుమార్,రామిడి తిరుపతి,మాడిశెట్టి గోపాల్, శివజ్యోతి పాల్గొన్నారు.
ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి
- Advertisment -
