దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల అందజేత
కరీంనగర్-జనత న్యూస్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటా ఇన్నోవేటర్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి మొదలు రైతులు, గృహిణులు, యువకులు.. ఇలా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సొంతంగా చేసిన ఆవిష్కరణలను పంపించాలని సూచించారు. ఆవిష్కరణలకు సంబంధించిన నాలుగు ఫోటోలు,100 పదాలు, రెండు నిమిషాలు నిడివి కలిగిన వీడియో, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబరు, ప్రస్తుత వృత్తి పూర్తి వివరాలు 9100678543 నంబర్ వాట్సప్ కు పంపించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 3 వ తేదీలోగా పంపించాలని తెలిపారు. వచ్చిన ఆవిష్కరణల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని కలెక్టర్ తెలిపారు.
దివ్యాంగులకు లాప్‌టాప్‌ల పంపిణీ
తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి మంజూరైన లాప్ టాప్ లను ముగ్గురు అంధ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. మౌనిక, హరీష్, సృజన్ రెడ్డి ముగ్గురు దివ్యాంగులకు లాప్‌టాప్ లను అందజేశారు. సకలాంగులకు దీటుగా దివ్యాంగులు చదువుల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ పవన్ కుమార్, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, ఏవో సుధాకర్, డీఈఓ జనార్దన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, ఈడియం శ్రీరామ్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటింటా ఇన్నోవేటర్ కోఆర్డినేటర్ మణిదీప్ పాల్గొన్నారు.