స్మార్ట్‌సిటీ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలి
‘స్వచ్ఛత’ను జీవన విధానంగా మార్చుకోండి
స్వచ్చతహీ సేవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్-జనత న్యూస్
ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తరువాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
కరీంనగర్ సప్తగిరి కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్ పేయి, స్థానిక కార్పొరేటర్లు ఆయన పాల్గొన్నారు. కాలనీలో చీపురుపట్టి ఊడ్చి చెత్తను పారపట్టి ఎత్తారు మంత్రి బండి సంజయ్. మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ..మనుసు మంచిగుంటే మంచి ఆలోచనలు వస్తాయని, సమాజానికి మంచి జరుగుతుందన్నారు. సఫాయి కార్మికుల క్రుషి వల్లే శానిటేషన్ విషయంలో కరీంనగర్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్మార్ట్‌సిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేసి అభివ్రుద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృదినధ సాధ్యమన్నారు. ఎన్నికల తరువాత కూడా రాజకీయాలకే పరిమితమైతే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారని, పదేళ్లు కానున్నందున దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 5 లక్షల డర్టీ స్పాట్ (మురికి ప్రదేశాలు) గుర్తించి వాటిని పూర్తి పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కార్పొరేషన్ లో 17 డర్టీ స్పాట్ లను గుర్తించినట్లు తెలిపారు. అంతకుముందు మేయర్ సునీల్ రావు మాట్లాడారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండంత అండగా నిలిచారని తెలిపారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు..ఆ తరువాత..

- Advertisment -